ఆర్డీటీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ గర్ల్స్‌ డే

May 15,2024 21:38

కార్యక్రమంలో మాట్లాడుతున్న అధికారులు

                       ముదిగుబ్బ : ఆర్డీటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్డీటీ ప్రతినిధి కృష్ణవేణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని ఏవిధంగా పరిష్కరించుకోవాలి అన్న వాటి గురించి అవగాహన కల్పించారు. అంతకు ముందు బాలికలు నిర్వహించిన రాతపరీక్షల్లో ప్రతిభ కనపర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ వెంకటరమణ, కదిరి గంగాధర్‌, ఆర్డీటీ ముదిగుబ్బ ఎటిఎల్‌ కృష్ణ, ఆర్డీటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️