కదిరి ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి

Jun 10,2024 21:43

 సమావేశంలో పాల్గొన్న చేనేత సంఘం నాయకులు

               ధర్మవరం టౌన్‌ : ధర్మవరం, కదిరి ఎమ్మెల్యేలు సత్య కుమార్‌ యాదవ్‌, కందికుంట వెంకట ప్రసాద్‌కు మంత్రి పదవులు ఇవ్వాలని ధర్మవరం పట్టు చీరల తయారీ వ్యాపారుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆసంఘం అధ్యక్షులు గిర్రాజు రవి, కార్యదర్శి హేమంత్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్‌, రంగ మాది నారాయణ, గౌరవ అధ్యక్షులు పోలా వెంకటరమణ, కలవల రాంకుమార్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని సెమినారాయణ స్వామి దేవాలయంలో చేనేత వ్యాపారస్తుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దీంతో వ్యాపారులు, చేనేత కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 56 సంవత్సరాలు తర్వాత బీసీ సామాజికవర్గానికి చెందిన సత్య కుమార్‌ యాదవ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారని అన్నారు. చంద్రబాబు నాయుడు వీరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యురాలు జయశ్రీ, నీలూరి శ్రీనివాసులు, నామాల శంకర్‌, కలవల మురళీధర్‌, పామిశెట్టి శివశంకర్‌, గిర్రాజు శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

కదిరి టౌన్‌ : ప్రజా సేవకుడు కందికుంటకు మంత్రి పదవి ఇవ్వాలని బిసి, చేనేత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజు కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ చేనేత వర్గానికి చెందిన వారందరూ మొదటి నుంచి టిడిపి వెంటే ఉన్నారన్నారు. ఆ వర్గానికి చెందిన వారి సమస్యలు తీరాలంటే చేనేత వర్గానికి చెందిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఆ సంఘం నాయకులు కోరారు.

➡️