విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
ధర్మవరం టౌన్ : పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 15వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు, టూ టౌన్ సీఐ రెడ్డప్ప, ఎంఇఒలు రాజేశ్వరి గోపాల్ నాయక్, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు శెట్టిపి జయ చంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని, అన్ని రంగాలలో రాణించాలని సూచించారు.. విద్యార్థులు ఇష్టపడి చదివినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారన్నారు. గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో టౌన్ ఫస్ట్ వచ్చిన నిత్యశ్రీని వారు ఈసందర్భంగా అభినందించారు. అనంతరం వివిధ అంశాలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శెట్టిపి రామిరెడ్డి, చిన్న కిష్టమ్మ, కరెస్పాండెంట్ నిర్మలాదేవి, డైరెక్టర్లు సూర్యప్రకాశ్ రెడ్డి, పద్మ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.