కిరణ్మయితో బాస్కెట్ బాల్ అసోసియేషన్ సభ్యులు
ప్రజాశక్తి -ధర్మవరం టౌన్
జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు పట్టణానికి చెందిన జి.కిరణ్మయి ఎంపిక కావడం గర్వకారణమని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేట్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రా రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకూ చెన్నైలో జరిగే అండర్-17 బాలికల ఎస్‌జిఎఫ్ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టుకు జి.కిరణ్మయి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. గతేడాది అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకూ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన టోర్నమెంట్‌లో కిరణ్మయి ప్రతిభ చాటిందని ధర్మాంబ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా, కోచ్ సంజరు హర్షం వ్యక్తం చేశారు. కిరణ్మయి శనివారం చెన్నైకి బయల్దేరి వెళ్లింది. కార్యక్రమంలో కోచ్ హిదయతుల్లా, శెట్టిపి జయచంద్రారెడ్డి, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.