రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు
లేపాక్షి : మండల పరిధిలోని కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాఫ్ట్ బాల్, , బేస్ బాల్, నెట్ బాల్ విభాగంలో ప్రతిభ కనపర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అనంతపురంలోని ఆర్ డి టి స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినకొండూరు విద్యార్థి దుర్గాప్రసాద్, అండర్ 14 బాలికల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన లలిత, అండర్ 14 విభాగంలో మొదటి స్టాండ్ బైగా పరమేష్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ పాల్ పోటీలకు ఎంపికయ్యారు. అదే విధంగా బేస్ బాల్ విభాగంలో అండర్ 17 బేస్‌బాల్ లో నౌషద్, అండర్ 14 విభాగంలో లోహిత్, ప్రభాకర్ ఎంపికయ్యారు. ఇక నెట్ బాల్ విభాగంలో పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థి నాని, 8వ తరగతి విద్యార్థిని నవ్య రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం అశోక్, వ్యాయామ ఉపాధ్యాయులు శివకుమార్, పాఠశాల కమిటీ చైర్మన్ నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.