అవగాహన కల్పిస్తున్న పోలీసులు
కదిరి టౌన్ : సారాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగముద్దయ్య పిలుపు ఇచ్చారు.గురువారం కదిరి రూరల్ మండలం బత్తలపల్లి తండా, కట్ల తండా, బాలప్పగారిపల్లి తండాలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభలలో నాగమద్దయ్యతో పాటు ఆర్డీవో వివిఎస్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటుసారా వల్ల సమాజంలో చెడు ప్రభావాలు ఉత్పన్నవుతాయన్నారు. నాటుసారా తాగడం వలన ఆనారోగ్యానికి గురవుతారన్నారు. అనంతరం ప్రజల చేత నాటు సారా నిర్మూలనపై పతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ గోవింద నాయక్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహులు, స్థానిక ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఎస్‌ఐ శ్రీధర్, ఎస్‌ఐ దత్తాత్రేయ, క్సైజ్ సిబ్బంది, ఫారెస్ట్ బీట్ అధికారి, గ్రామ మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.