పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్కు ఆఖరి విన్నపం అందజేత
ప్రజాశక్తి-సత్య సాయి : శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా రోడ్లు విద్యుత్తు లైన్ల రియల్ ఎస్టేట్లు భవన నిర్మాణాలు అక్రమ కలప వ్యాపారం ఇవే కాకుండా పక్క రాష్ట్రాలకు పేపర్ మిల్లులకు పెద్ద ఎత్తున కరువు జిల్లా నుండి వాల్టా చట్టాన్ని ధిక్కరించి వృక్ష సంపదను కళ్ళ ఎదుట తరలిస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు కఠిన చర్యలు చేపట్టలేదు. కనుక జిల్లా పాలనా అధికారయిన కలెక్టర్ కి ఆఖరి విన్నపముగా ఈరోజు సాక్షాదారాలతో సహా మెమొరాండం సమర్పించడమైనది. దీనిపై తక్షణ చర్యలు చేపట్టనిచో కరువు జిల్లాను కాపాడుటకు తమ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు ఆదేశాల మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా లక్షల ఎకరాల అడవులలో కోట్ల చెట్లు, జీవరాసులు అగ్నికి ఆహుతి కాకుండా తక్షణ చర్యలు చేపట్టమని తగిన నిధులు, సి ఎస్ ఆర్ ఫండ్స్ ప్రైవేట్ సంస్థలకు కేటాయించి అడవులను కాపాడాలని తెలియజేస్తామన్నారు.