ధర్మవరం ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేష్
ధర్మవరం-ప్రజాశక్తి రూరల్
ధర్మవరం ఆర్డీవోగా మహేష్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న వెంకట శివారెడ్డి గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో మహేష్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన నూతన ఆర్డీవోను ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, తహశీల్దార్ నటరాజ్, డిఫ్యూటీ తహశీల్దార్ ఈశ్వరయ్యలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.