సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో
పుట్టపర్తి రూరల్ : గ్రామ పట్టణ ప్రాంతాల్లో రైతుల సమన్వయంతో భూముల రీసర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆమె బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో డివిజన్‌లోని తహశీల్దార్లు, మండల, గ్రామ సర్వేయర్లు, డిప్యుటీ తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, రోడ్డులు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు గ్రామపటంలో గుర్తించాలన్నారు. రైతుల భూములు హద్దులు /గట్లు సమస్యలను పరిష్కరించాలన్నారు. రోవర్స్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. ఈ రీసర్వేను ప్రజలందరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో డిఎఒ జిలాని, డీటీలు మనోజ్ కుమార్ రెడ్డి, మంజుల, స్వాతి, తహశీల్దార్లు పుట్టపర్తి అనుపమ, కొత్తచెరువు నీలకంఠారెడ్డి, ఒడిసి అనంతచారి, బుక్కపట్నం షాబుద్దీన్, నల్లమాడ రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.