పార్టీలోకి చేరిన వారితో నాయకులు
మడకశిర : పట్టణంలోని రహదారులు విశ్రాంతి భవనంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరారు. మండల పరిధిలోని వైబి హళ్ళి పంచాయతీ వైసిపి నాయకులు రంగనాధ్, కాంత, హనుమంత రాయప్ప, లక్ష్మి నరసింహాప్ప, చంద్ర, ఉమేష్, టైలర్ నారాయణాప్ప, రాజన్న, కుమార్, మంజు, రామాంజి, పెద్ద తిమ్మప్ప, వేణు, ఆనంద్‌తోపాటు 20 కుటుంబాలు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస మూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రంగే గౌడ్ ,మడకశిర టి ఎన్ టి యు సి అధ్యక్షుడు రాజు, రవీంద్రారెడ్డి, నరసేగౌడ్ తదితరులు పాల్గొన్నారు.