అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం : ఎస్పీ

Oct 30,2024 22:52

 కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, మాజీ మంత్రి, తదితరులు

                     పుట్టపర్తి క్రైమ్‌ : పోలీస్‌ అమరవీరుల త్యాగాలను మరవలేనివని జిల్లా ఎస్పీ వి. రత్న పేర్కొన్నారు. బుధవారం రాత్రి పుట్టపర్తి పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో హనుమాన్‌ సర్కిల్‌ వద్ద పోలీసు అమరవీరుల స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ వి.రత్న మాట్లాడుతూ అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తించుకొని వారి సేవలను స్మరించుకుంటూ వారు చూపిన దారిలో ముందుకు నడవాలన్నారు. మన రాష్ట్రంలో బాబా వలి, చంద్రశేఖర్‌ ఇద్దరు పోలీసులు అమరులయ్యారని, వారోత్సవాల సందర్భంగా వారి కుటుంబాలను కలిసి గౌరవించడం జరిగిందని వారికి ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయ సహకారాలు కూడా అందించడం జరిగిందని అన్నారు. అమరులైన పోలీస్‌ త్యాగాలను మనమందరం గుర్తు చేసుకుంటూ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని విజయవంతం చేసినందుకు పుట్టపర్తి ప్రజలందరికీ కతజ్ఞతలు తెలిపారు. పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈనెల 21 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు పోలీసులు చేపట్టారని చెప్పారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ పోలీసులసేవలో అమోఘమని అమరులైన పోలీసులు అందరిని స్మరించుకోవాలని అన్నారు. అనంతరం హనుమాన్‌ సర్కిల్‌ నుండి పట్టణంలోని ప్రధాన రహదారి నుండి విద్యాగిరి ఆర్చ్‌ వరకు పోలీస్‌ బ్యాండ్‌ మధ్య, పోలీస్‌ అధికారులు సిబ్బంది, పట్టణ ప్రముఖులు ఆటో డ్రైవర్లు మహిళలు ప్రజలు పోలీసులు విద్యార్థులు, పట్టణ ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీగా పెద్ద ఎత్తున వెళ్లి విద్యా గిరి ఆర్చ్‌ వద్ద ఏర్పాటుచేసిన పోలీస్‌ అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ఉంచి పోలీస్‌ అమరవీరుల నివాళులర్పించారు. అనంతరం పోలీస్‌ అమరవీరుల జోహార్‌ అంటూ నినాదాలు చేశారు. పట్టణ పురవీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, ఆర్డీవో సువర్ణ, అడిషనల్‌ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, పుట్టపర్తి డిఎస్పి విజరు కుమార్‌, ఏఆర్‌ డీస్పీ విజరు కుమార్‌, ఎస్బి సిఐ,బాలసుబ్రమణ్యం రెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌, సిఐలు సునీత, సురేష్‌, ఇందిర నరేందర్‌ రెడ్డి, ఆర్‌ఐలు వలి మహేష్‌, రవికుమార్‌, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు ప్రదీప్‌ సింగ్‌, వీరన్న, ఎస్‌ఐలు ప్రజలు పాల్గొన్నారు.

➡️