ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తున్న మున్సిపల్ ఛైర్మన్ రమేష్ కుమార్
హిందూపురం : ప్రజలు వారు ఎదుర్కొనే వివిధ సమస్యలపై ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ప్రాధాన్యత రూపంలో పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ వ్యాప్తంగా వివిధ వార్డుల్లో ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూవచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిశీలన చేసి ప్రాధాన్యత రూపంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శోభన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో పాటు పలువురు కౌన్సిలర్లు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.