22న ‘పురం’లో మెగా జాబ్‌మేళా

పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్‌ చేతన్‌

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఉదయం 9 గంటలకు హిందూపురం శ్రీ బాలాజీ విద్యా విహార్‌ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ఆఫీసర్‌ బండ్ల హరికష్ణ తెలిపారు. జాబ్‌మేళాలకు సంబంధించిన పోస్టర్లను శనివారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ దాదాపు 20 బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పది, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఐటిఐ, డిప్లొమో, బీఫార్మసీ, నర్సింగ్‌, బీటెక్‌ తదితర కోర్సులు చదవిన వారందూ ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. జాబ్‌మేళాలో సెలెక్ట్‌ అయిన అభ్యర్థులకు నెలకు రూ.10 నుంచి రూ.40 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు విద్యార్హత పత్రాలు జిరాక్స్‌, ఆధార్‌ కార్డ్‌, రెండు ఫొటోలు తీసుకుని రావాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9976706976, 9966682246 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలన్నారు. ఆన్‌లైన్‌కు సంబంధించి ష్ట్ర్‌్‌జూర:// అaఱజూబఅyaఎ. aజూ.స్త్రశీఙ.ఱఅ/బరవతీ- తీవస్త్రఱర్‌తీa్‌ఱశీఅలో రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు.

➡️