మహిళాభివృద్ధే లక్ష్యం : మంత్రి సవిత

Apr 10,2025 22:33

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సవిత

                     గోరంట్ల : మహిళాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పట్టణంలో కూరగాయల మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్‌ కేంద్రాన్ని ఆమె గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో జీవించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది లక్ష మందికి మూడు నెలల పాటు ఉచితంగా కుట్టుమిషన్‌ శిక్షణ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్క మిషన్‌ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. గోరంట్ల మండలంలోని5 ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాల్లో శిక్షణ పొందడానికి 640 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, నాయకులు పచ్చ అశోక్‌, బాలకృష్ణ చౌదరి, నరేష్‌, వేణు రాయల్‌, జయరాం తదితరులతో పాటు ఎంపీడీవో నరేంద్ర కుమార్‌, తహశీల్దార్‌ మారుతి ప్రసాద్‌ కూటమి నాయకులు పాల్గొన్నారు

➡️