రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి

పరిగి చెరువును పరిశీలిస్తున్న మంత్రి సవిత

ప్రజాశక్తి-పరిగి

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి సంక్షేమ, చేనేత జౌలి శాఖల మంత్రి సవిత వెల్లడించారు. మంత్రి ఆదివారం పరిగి ట్యాంక్‌ బండ్‌ను పరిశీలించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుం దన్నారు. పరిగి చెరువు పూర్తిస్థాయిలో నిండిన వెంట నే చెరువు పరిధిలోని ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు ఆదేశించారు. అలాగే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి లీకేజీల ను పూర్తిస్థాయిలో నివారించాలని సూచించారు. ఇప్పటివరకూ నిర్వహించిన పనుల వల్లనే చెరువులోకి పూర్తిస్థాయిలో నీరు చేరే అవకాశం ఉందని ఆ విధంగా పని చేసిన డి.లక్ష్మీనారాయణ, కరణం లక్ష్మీనారాయణలను అభినందించారు. మంత్రి వెంట మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, మాజీ జడ్పిటిసి సూర్యనారాయణ, సర్పంచి బాలాజీ, మాజీ ఎంపిపి సత్యనారాయణ ఉన్నారు.

మృతుని కుటుంబానికి పరామర్శ

         ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని కాలువపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు వాల్మీకి బొజ్జప్ప చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ విషయం తెలియడంతో మంత్రి ఆదివారం కాలువపల్లి గ్రామానికి వెళ్లి బొజ్జప్ప మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే అంత్యక్రియల కోసం ఆర్థికసాయం అందజేశారు.

టిడిపిలో కార్యకర్తలకు తగిన గుర్తింపు

       పెనుకొండ : దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీలో లేనివిధంగా టిడిపిలో క్రియాశీలక కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని మంత్రి సవిత తెలిపారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం మంత్రి పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పెనుకొండ నియోజకవర్గం ఎప్పటికీ టిడిపి కంచు కోట అన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో భాగస్వాములు కావాలన్నారు. నా గెలుపు వెనక కార్యకర్తల కష్టం ఉందన్నారు. సుశిక్షితులైన కార్యకర్తలే తనకు ఆస్తి పాస్తులన్నారు. టిడిపి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి రికార్డు స్థాయిలో సభ్యత్వాలు చేయించాలని సూచించారు. అలాగే సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. టిడిపి సభ్యత్వంతో ప్రతి కార్యకర్తకు భరోసా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేత పట్టణంలోని తన కార్యాలయంలో మంత్రి సవిత ఆదివారం 8మందికి సిఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. అందులో నిజప్పగారి మైలారప్పకు రూ. 15వేలు, ఈశ్వరమ్మకు రూ. 25వేలు, దీపికకు రూ. 20వేలు, పెద్దన్నకు రూ. 87,709, మహబూబాషాకు రూ. 16,670, నాగభూషణంకు రూ. 1,53,290, నాగార్జున కళావతికి రూ. 20వేలు, సుకన్యకు రూ. 1,67,727 చెక్కులను అందజేశారు.

➡️