మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు సన్మానం

Nov 28,2024 21:07

 మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ను సన్మానిస్తున్న దృశ్యం

                     హిందూపురం : రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ గురువారం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్బంగా మైనార్టీ సోదరులు పట్టణంలోని జామియా అశ్రఫుల్‌ ఉల్‌ ఉలూమ్‌ మదరసాలో ప్రిన్సిపల్‌ మౌలానా అబ్దుల్‌ జబ్బార్‌ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ ను ఘనంగా సన్మానించారు. అదే విధంగా అఖిల భారత ఫ్రీడమ్‌ ఫైటర్‌ షహీద్‌ టిప్పు సుల్తాన్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు ఉమర్‌ ఫారూఖ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ కు సన్మానించి, టిప్పు సుల్తాన్‌ షహీద్‌ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేశారు. టిడిపి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాబా, అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️