కందుల నాణ్యతను పరిశీలిస్తున్న కంపెనీ ప్రతినిధులు
రొద్దం : మార్కెట్‌ఫెడ్ కంపెనీ ప్రతినిధులు మండలంలోని పలువురు రైతులకు చెందిన కందుల నాణ్యతను బుధవారం పరిశీలించారు. మండల కేంద్రంలో రైతుల పండించిన కందులను కొనుగోలు చేయడానికి ఈ నెల 16న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్‌ఫెడ్ కంపెనీ ఎఫ్‌ఇఒ రామాంజనేయులు తెలిపారు. దీంతో ముందుగా బుధవారం పెనుగొండ బాగోడ ప్రధాన రహదారిలో శ్రీ బాలాజీ లేఅవుట్లలో ఉన్న కందుల నాణ్యతను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్క్ పెడ్ కంపెనీ ఎఫ్‌ఈఓ రామాంజనేయులు, రైతులు బికె. సుధాకర్, మారుతి రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసులు, చంద్రశేఖర్, జయరాములు, ధనుంజయ రెడ్డి, కొట్టాల రమేష్, అనిల్ రెడ్డి పాల్గొన్నారు.