ఆన్‌లైన్‌లో గణేష్‌ ఉత్సవాలకు అనుమతులు : ఎస్పీ

ఎస్పీ వి.రత్న

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌

సింగిల్‌ విండో విధానంతో గణేష్‌ ఉత్సవాల అనుమతులు సులభంగా పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్‌ ద్వారా నిర్వాహకులు అనుమతులు పొందవచ్చని ఎస్పీ వి. రత్న శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలిపారు. ప్రత్యేక పోర్టల్‌తో పాటు చాట్‌, బాట్‌ సేవలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 7995095800 మొబైల్‌ నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా హారు అని సందేశం పంపిస్తే ఎన్‌ఒసి పత్రం కోసం అనుసరించాల్సిన ప్రక్రియ మొత్తం సంబంధిత వాట్సాప్‌కి వస్తుందన్నారు. ఈ విధానంతో ప్రజలు సులభతరంగా గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమర్జనంకు మీ-సేవలో చలానా రుసుంను చెల్లించి, నిరభ్యంతర పత్రం క్యూఆర్‌ కోడ్‌ను పొందవచ్చనన్నారు. జిల్లాలో గణేష్‌ ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులు సింగిల్‌ విండో విధానంలో వివరాలను పూర్తి చేసి, అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులను, క్యూఆర్‌ కోడ్‌ ను ఉత్సవాలను నిర్వహించే పందిరిలో తనిఖీలకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉంచాలని కోరారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు అనుమతులు పొందాలనుకునే వారు ష్ట్ర్‌్‌జూర://స్త్రaఅవరష్ట్రబ్‌ఝఙ.అవ్‌ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి, న్యూ అప్లికేషన్‌ మీద క్లిక్‌ చేసి అందులో కన్పించే దరఖాస్తులోని వివరాలు అన్నింటినీ పూర్తి చేసి అనుమతులు పొందవచ్చన్నారు. ప్రశాంత వాతావరణంలో చవతి ఉత్సవాలు నిర్వహించుకునేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

➡️