ప్రశాంత ఎన్నికల నిర్వహణ అభినందనీయం

Jun 10,2024 21:42

 డిఆర్‌ఒ కొండయ్యను సన్మానిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు

                   పుట్టపర్తి అర్బన్‌ : జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు, ఎస్పీ మాధవరెడ్డి ఇతర ఉన్నతాధికారుల కృషి అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అందుబాటులో లేనందున డిఆర్‌ఒ కొండయ్యను కలసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా డిఆర్‌ఒ మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, పాత్రికేయుల సమిష్టి కృషితోనే ఎన్నికలు సజావుగా జరిగాయన్నారు. అలాగే జిల్లా ఎస్పీని కలిసిన నాయకులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బివి. భాస్కర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, నాయకులు రమేష్‌ రెడ్డి, గోవిందప్ప, లక్ష్మీనారాయణ రెడ్డి, రమణారెడ్డి, బూతేగౌడ్‌, అబ్దుల్‌ ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️