యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ జిల్లా మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ

కదిరిలో పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి – కదిరి టౌన్‌

యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ జిల్లా మహాసభలకు సంబందించిన పోస్టర్లను ఆసంఘం నాయకులు గురువారం విడుదల చేశారు. ఈనెల 10 న ఆదివారం కదిరి జిల్లా పరిషత్‌ బాలికొన్నత పాఠశాలలో నిర్వహించే స్వర్ణోత్సవ మహా సభల పోస్టర్లను నల్లమాడ ఎంఇఒ వేమ నారాయణ, రెడ్డిపల్లి ప్రధానోపాధ్యాయులు జంషీద్‌, యుటిఎఫ్‌ నల్లమాడ మండల అధ్యక్షుడు అయుబ్‌ భాష, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమశేఖర్‌, చంద్రనాయక్‌, సుధాకర్‌, పోతులయ్య, ఫైరోజ్‌బాష, బాబు నాయక్‌, లక్ష్మీనారాయణ, శివలక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం రూరల్‌ : యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని ఆసంఘం జిల్లా ఆడిట్‌ కన్వీనర్‌ ఆర్‌. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని బిఎస్సార్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్‌ జిల్లా మున్సిపల్‌ కన్వీనర్‌ బిల్లే రామాంజనేయులు, స్థానిక నాయకులు రాంప్రసాద్‌, హరిశంకర్‌, ప్రదీప్‌ కుమార్‌ తదితరులతో కలిసి యుటిఎఫ్‌ జిల్లా స్వర్ణోత్సవ మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

➡️