న్యాయస్థానాలకు ప్రత్యామ్నాయ భవనాలను సమకూర్చండి

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస్‌ రెడ్డిని సన్మానిస్తున్న న్యాయవాదులు

ప్రజాశక్తి-హిందూపురం

హిందూపురం న్యాయస్థాన ఆవరణలో ప్రస్తుతం నిర్వహిస్తున్న న్యాయస్థాన భవన సముదాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని స్థానిక బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు పరిపాలనా న్యాయమూర్తి స్పందించి వెంటనే కోర్టు నిర్వహణకు అనువుగా ఉండే ప్రత్యామ్నాయ భవన సముదాయాలను సమకూర్చాలని శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, ఇతర అధికారులను ఆదేశించారు. శనివారం న్యాయమూర్తి కె.శ్రీనివాస్‌ రెడ్డి అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా హిందూపురం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ న్యాయవాది జి.శ్రీనివాస్‌ రెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు రామచంద్రారెడ్డి, సుదర్శన్‌, జిఆర్‌.సిద్దూ ఆయన్ను కలిసి కోర్టు భవనాల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన కోర్టుల నిర్వహణకు భవన సముదాయాలను సమకూర్చాలని జాయింట్‌ కలెక్టర్‌కు తెలిపారు.

➡️