పిడుగుపాటు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆర్థిక సాయం చెక్కును అందిస్తున్న మంత్రి సవితమ్మ

ప్రజాశక్తి-గోరంట్ల రూరల్‌

గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుతో చనిపోయిన దాశరథి నాయక్‌ కుటుంబాన్ని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సోమవారం పరామర్శించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. తక్షణ సాయంగా ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, పాడి ఆవుకు రూ.37,500 సాయం అందించారు. రూ.8.75 లక్షల సాయాన్ని మృతుల కుమారుడు జగదీష్‌ నాయక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శుభ దాస్‌, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్‌ రావు పాల్గొన్నారు.

➡️