చిలమత్తూరులో విద్యాసామగ్రి అందజేస్తున్న దృశ్యం
గాండ్లపెంట : స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు దాతలు విద్యాసామగ్రి పంపిణీ చేసినట్లు పాఠశాల హెచ్‌ఎం సిద్ధారెడ్డి తెలిపారు. వాల్మీకి సేవా సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీ, స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న భాస్కర్ రాజు పదోతరగతి విద్యార్థులకు పెన్నులు, అట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పామిడి ముంతాజ్, చిన్నప్పయ్య, గంగాధర్, విశ్వనాథ్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
చిలమత్తూరు : యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు జయచంద్రా రెడ్డి సౌజన్యంతో చిలమత్తూరు యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో చిలమత్తూరు కేజీవీబీ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు పి. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి లక్షిపతి, శ్రీనివాసులు, నంజప్ప, సురేష్ కుమార్, అలీ ముల్ల, అనిల్, కుమార్, శంకర నారాయణ. జగదీశ్, విజయకుమార్, నవీన్, ముత్యాలప్ప, తదితరులు పాల్గొన్నారు.