విద్యార్థినిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు
లేపాక్షి : మండలం పరిధిలోని పులమతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి వైష్ణవి జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14 బాలికల రబ్బీలో రాష్ట్ర జట్టు తరపున జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనపర్చింది. బీహార్ రాష్ట్రం పాట్నాలో జనవరి 2 నుండి 4వ తేదీ వరకు జరిగిన పోటీలలో పాల్గొన్న 9వ తరగతి విద్యార్థిని బి వైష్ణవి ప్రతిభ కనపర్చింది. ప్రతిభా విద్యార్థినిని పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.