ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, తదితరులు
ధర్మవరం టౌన్ : వాహనదారులు సీటు బెల్టు, హెల్మెట్లతో ప్రయాణం చేస్తే సుఖవంతమైన ప్రయాణం అవుతుందని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. జాతీయ రహదారి మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ పట్టణంలోని రెండవ పోలీస్ స్టేషన్ వద్ద నుండి రైల్వే ఓవర్ బ్రిడ్జి కళాజ్యోతి సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ గాంధీనగర్ సర్కిల్ వరకు సాగింది. సీఐలు, డి.ఎస్.పి హేమంత్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ రత్న మాట్లాడుతూ సీటు బెల్ట్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరగడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తాయని అన్నారు. ప్రతి వాహనదారుడు నిబంధనలు పాటించి ప్రమాదరహిత ప్రయాణం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ హేమంత్ కుమార్, ట్రయినీ డీఎస్పీ పావని, వన్‌టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, 2 టౌన్ సిఐ రెడ్డప్ప, రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు, సచివాలయ మహిళా పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.