ధర్మవరంలో రూట్‌మార్చ్‌

May 14,2024 21:30

పట్టణంలో రూట్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న దృశ్యం

                   ధర్మవరం టౌన్‌ :సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినందుకు ధర్మవరం పట్టణంలో మంగళవారం సాయంత్రం డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు వన్‌ టౌన్‌ సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బిఎస్‌ఎఫ్‌ స్పెషల్‌ ఫోర్స్‌ పోలీసులు రూట్‌ మార్చ్‌ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిపైన అన్ని సర్కిళ్లలో రూట్‌ మార్చ్‌ చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా ముగిసినందుకు ప్రజలు పోలీసులకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల విధులలోనున్న బీఎస్‌ఎఫ్‌ స్పెషల్‌ ఫోర్స్‌ తమవంతు సహకారం అందించారన్నారు.

➡️