సమావేశంలో పాల్గొన్న ఎస్పీ, తదితరులు
ముదిగుబ్బ : శక్తి యాప్ మహిళలకు, బాలికలకు భద్రత కల్పిస్తుందని ఎస్పీ రత్న పేర్కొన్నారు. మండలంలోని మంగళమడక గ్రామంలో గురువారం రాత్రి నేర నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ శక్తి యాప్ ప్రతి మహిళ ఫోన్లో ఉంచుకోవాలన్నారు. యాప్ వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. అదేవిధంగా సైబర్ నేరాలపట్ల అప్రమత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ మహేష్, సీఐ శ్యామ్ రావు ఎస్‌ఐ రాజశేఖర్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.