పెనుగొండలో గెలవబోతున్నాం : సవితమ్మ

May 15,2024 21:39

 విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ

                       గోరంట్ల : పెనుగొండ నియోజకవర్గంలో టిడిపి అత్యధిక మెజార్టీతో గెలవబోతోందని ఆపార్టీ పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలో టిడిపి కార్యాలయంలో కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితమ్మ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు అత్యధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి కార్యకర్తలు నాయకులు బాగా పనిచేశారని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ చౌదరి, నరేష్‌, మరి రెడ్డి పల్లి నరసింహులు, జీనవాండ్లపల్లి లక్ష్మీనరసప్ప, ఉత్తమ్‌ రెడ్డి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. పరిగి : పెనుకొండ నుంచే వైసీపీ అంతం ప్రారంభమవుతుందని పెనుగొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ వ్యాక్యానించారు. బుధవారం పరిగి మండల కేంద్రంలోని బీర లింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మండల వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో టిడిపి ఉన్నతకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. అనంతరం పంచాయతీల వారీగా నాయకులు కార్యకర్తలతో ఎన్నికల రివ్యూ నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి ఐటి విభాగం ప్రతినిధి మంజునాథ్‌, మారుతి, మండల నాయకులు బాలాజీ, సత్యనారాయణ, శ్రీనివాసరెడ్డి, శేఖర్‌, ఈశ్వరప్ప, నాగభూషణం, చౌడప్ప, హనుమయ్య, వడ్డెర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

➡️