శ్రీసత్యసాయి అనువాదకులు అనిల్‌ కుమార్‌ మృతి

మృతిచెందిన ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌ (ఫైల్‌ఫొటో)

          పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా బోధనలు, ఉపన్యాసాలను ఆంగ్లంలో అనువదించే అనువాదకులు ప్రొఫెసర్‌ అనిల్‌ కుమార్‌(80) మృతి చెందారు. హదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. సుదీర్ఘకాలంగా సత్యసాయిబాబా అనువాదకులుగా అనిల్‌కుమార్‌ సేవలు అందించారు. ఆయన మృతి పట్ల బాబా భక్తులు దిగ్బ్రాంతి చెందారు. అనిల్‌కుమార్‌ దేశ విదేశీయులకు సుపరిచితం అయిన వ్యక్తి. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.

➡️