సబ్‌స్టేషన్ వద్ద విద్యార్థులు
పుట్టపర్తి రూరల్ : మండల పరిధిలోని జగరాజు పల్లి సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆదర్శ పాఠశాల విద్యార్థులు మంగళవారం సందర్శించారు. ఇండిస్టియల్ విజిట్ లో భాగంగా పాఠశాల విద్యార్థులు గ్రామ సమీపంలో గల 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను సందర్శించారు. సబ్ స్టేషన్‌లో గల ట్రాన్స్‌ఫార్మర్ ఫంక్షనింగ్, ఫీడర్ బ్రేకర్స్ పనిచేసే విధానంపై సిబ్బంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆదర్శ పాఠశాలలో భారత రాజ్యాంగం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్ బాబు, ఒకేషనల్ ట్రైనర్ శ్రీనివాసులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.