డ్రోన్‌ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోండి

Dec 11,2024 22:40

 డ్రోన్‌ వాడకాన్ని వివరిస్తున్న అధికారులు

                     ఓబుళదేవర చెరువు : డ్రోన్‌ టెక్నాలజీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎడిఎ సనావుల్లా, సత్యనారాయణ సూచించారు. బుధవారం మండల పరిధిలోని సున్నంపల్లిలో ముక్కెర నరసింహులు అనే రైతు పొలములో డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా 13 ఎకరాల వేరుశనగ పంటకు మందులు స్ప్రే చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ డ్రోన్స్‌ టెక్నాలజీని వాడటం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ ఎకరాలకు మందులు స్ప్రే చేయవచ్చునని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఒ ఇలియాస్‌, రైతు సేవా కేంద్రం అధికారి రాఘవేంద్ర యాదవ్‌, రైతులు పాల్గొన్నారు.

➡️