దాడిలో గాయపడిన హిదాయత్
ప్రజాశక్తి హిందూపురం
పట్టణంలోని కోట ప్రాంతంలో నివాసం ఉంటున్న టిడిపి మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎండిఎస్ హిదాయత్‌పై శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు హిదాయత్ పట్టణంలోని ఇందిరా నగర్‌లో అతని స్థలంలో ఉన్న బోరు బావి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్ధులు ఒక్కసారిగా కత్తితో పొడవడానికి ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆయన కుడి చేయి అడ్డుపెట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పొట్టలోకి పొడి చారు. దీంతో హిదాయత్ పెద్దగా అరవడంతో నింది తులు అక్కడి నుంచి పారిపోయారు. దాడిలో గాయ పడిన హిదాయత్‌ను స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఈ సంఘటనపై హిదాయత్, అతని తమ్ముడులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మున్సిపల్ వారికి తమకు భూ వివాదం ఉందన్నారు. ఈ విషయంపై షాజహాన్, సుహేబ్ తదితరులు ప్రతిసారీ జోక్యం చేసుకుంటున్నారు. ఇదే విషయంలో తమపై పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు సైతం బనాయించారు. గత వారం నుంచి చంపుతామంటూ బెదరింపులకు గురి చేస్తున్నారన్నారు. బెదిరింపులు తాళలేక శనివారం మధ్యాహ్నం టూటౌన్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు తెలిపారు. సిఐ అందుబాటులో లేక పోవడంతో సాయంత్రం వచ్చి ఫిర్యాదు చేద్దామని వెనక్కు వచ్చేశామన్నారు. ఈ విషయం తెలుసుకున్న షాజహాన్, సుహేబ్, వసీం, ఫయాజ్, సిద్ధిక్‌లు కత్తితో దాడి చేశారన్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే టూ టౌన్ సిఐ అబ్దుల్ కరీం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.