ఉపాధ్యాయ వృత్తి ఓ బాధ్యత

సన్మానించిన ఉపాధ్యాయులతో యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం

ఉపాధ్యాయ రంగం వత్తిగా భావించకుండా సామాజిక బాధ్యతగా గుర్తెరగాలని ఎంఇఒలు తెలియజేశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డు పొందిన ఉపాధ్యాయులను యుటిఎఫ్‌ ఆద్వర్యంలో రోటరీ క్లబ్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మారుతీ శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంఇలు గంగప్ప, ప్రసన్న లక్ష్మి, లక్ష్మిదేవి, శ్రీ శేషాచలం, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయచంద్రారెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించి వారిని ప్రయోజకులు చేయడంలో ఉపాధ్యాయులు పాత్ర ఎనలేనిదన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులు శేషగిరిబాబు, జిఆర్‌.శ్రీనివాసులు, పిఎన్‌.ప్రసాద్‌, రామాంజనేయులు, కమలమ్మ, చంద్రమౌళేశ్వర గుప్త, శ్రీదేవి, శంకర్‌ నాయక్‌లను సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు బాబు, సీతాలక్ష్మి, మహంతీశ్వర, చెన్నకేశవులు, రామకృష్ణ, హనుమంతప్ప, అనిల్‌, సురేష్‌ పాల్గొన్నారు.

➡️