రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి సవిత
గోరంట్ల, గోరంట్ల రూరల్ : గ్రామాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. ఈ మేరకు రూ. 1.14 కోట్ల వ్యయంతో చేపట్టిన మండలంలోని మేరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే బిటి రోడ్డును మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు వేసి గ్రామానికి వస్తానని ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని నెరవేర్చానని చెప్పారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. గోరంట్ల మండలంలో ఆరు కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీలు పనులు జరుగుతున్నాయన్నారు. సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పచ్చ అశోక్, బాలకృష్ణ చౌదరి, దేవా నరసింహులు, సోమశేఖర్, సుబ్బారెడ్డి, వేణు రాయల్, హరి, నరేష్, సుధాకర్ రెడ్డి, ఉత్తమ రెడ్డి, అజ్మతుల్లా, నిమ్మల శ్రీధర్, శ్రీనివాసులు, కిషోర్ రాయల్, అశ్వత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అభివృద్ధిపై చర్చకు సిద్ధం :జగన్ అయిదేళ్ల పాలనలో, సీఎం చంద్రబాబునాయుడు ఏడు నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని మంత్రి సవిత స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగానైనా, నియోజక వర్గస్థాయిలోనైనా అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయ స్వలాభంతో కొన్ని వలస పక్షులు వస్తూ పోతుంటాయని, ఈ విషయం తెలిసే నియోజక వర్గ ప్రజలు తనకు అత్యధిక మెజార్టీ ఇచ్చారని అన్నారు. జగన్ అసమర్థ పాలనను చూసే ప్రజలు వైసీపీకి 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. గత అయిదేళ్లపాలనలో జగన్ రెడ్డి ఏనాడూ మీడియా ముందుకు రాలేదన్నారు. జగన్ అసమర్థతను చూసి వైసీపీకి చెందిన కీలక నేతలంతా ఆ పార్టీ నుంచి బయటకొస్తున్నారని అన్నారు.
టిడిపిలో పలువురు చేరిక
పరిగి : మండలంలోని యర్రగుంట గ్రామ పంచాయతీ చెందిన వైసిపి నాయకులు మంత్రి సవిత ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. బుధవారం పెనుగొండ లోని టిడిపి కార్యాలయంలో వారు టిడిపిలో చేరారు. మాజీ సర్పంచి వెంకటరామప్పతో పాటు మరో 5 కుటుంబాలు మంత్రి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టిడిపిలోకి చేరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ, ఎర్రగుంట మూర్తి,నాగభూషణ, చంద్ర పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.