పట్టాలు తప్పిన బోగీలను సరి చేస్తున్న రైల్వే సిబ్బంది
ప్రజాశక్తి-పెనుకొండ
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన శుక్రవారం మండలంలోని మక్కాజిపల్లి రైల్వేస్టేషన్ వద్ద చోటుచేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు.. బెంగళూరు వైపు నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న ఓ గూడ్స్ రైలు గుట్టూరు సమీపంలోని మక్కాజిపల్లి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే రెండు చక్రాలు పట్టాలపై నుంచి పక్కకు ఒరిగాయి. గమనించిన లోకో పైలెట్ అప్రమత్తమై గూడ్స్‌రైలును ఆపేశారు. అనంతరం బెంగళూరు నుంచి దాదాపు 200 మంది రైల్వే సిబ్బంది, ఇంజినీర్లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో పక్కకు ఒరిగిన రైలు చక్రాలను సరి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ధర్మవరం-పెనుకొండ మధ్య వచ్చే రైళ్లను పుట్టపర్తి మీదుగా దారి మళ్లించారు. మధ్యాహ్నం 1 గంటకు ట్రాక్ సరి చేయడంతో ఈ మార్గంలో రైళ్లను యథావిధిగా నడిపారు.