నేడు డాకు మహారాజ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

ప్రజాశక్తి-అనంతపురం

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గురువారం నాడు అనంతపురం నగరంలో జరుగనుంది. సాయంత్రం జరిగే ఈ ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం నగరం శ్రీనగర్‌ కాలనీలోని ముత్యాల్‌రెడ్డి గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ జరగనుంది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ జగదీశ్‌ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సభా ప్రాంగణానికి స్వయంగా వెళ్లి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈవెంట్‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా విచ్చేస్తున్నారు. ఈయనతో పాటు హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్‌ సభ్యులందరూ కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

➡️