‘కందికుంట’కు యుటిఎఫ్‌ నాయకుల అభినందన

Jun 10,2024 21:46

కందికుంటను సన్మానిస్తున్న నాయకులు

              కదిరి టౌన్‌ : స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు యుటిఎఫ్‌ స్థానిక నాయకులు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కదిరి డివిజన్‌ పరిధిలోని మండలాలకు చెందిన యుటిఎఫ్‌ నాయకులు సోమవారం కందికుంటను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, 117 జీవోను రద్దుకు ఒత్తిడి తేవాలని వారు ఈసందర్భంగా కందికుంటను కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్‌ కుమార్‌, మల్లికార్జున, ఆజంబాషా, మైనుద్దీన్‌, మధుసూదన్‌ భార్గవ, మహబూబ్‌ బాషా, కాజా మొయినుద్దీన్‌, మనోహర్‌, నాగరాజు, రాంప్రసాద్‌ నాయక్‌, రామసుబ్బయ్య, రమణారెడ్డి, బాలాజీ నాయక్‌, రమేష్‌ బాబు, కనికరం ప్రసాదు, హనీఫ్‌, యుగంధర్‌, రమణ నాయక్‌ , ఖాదర్‌ భాషా, జబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.

➡️