బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులను సన్మానిస్తున్న న్యాయవాదులు
ప్రజాశక్తి-హిందూపురం
హిందూపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కెఎల్ వన్నేరప్ప, ప్రధాన కార్యదర్శిగా పివి.రామచంద్రప్ప ఎన్నికయ్యారు. ఇటీవల బార్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారి కేసీ.రఘునాథ్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. అధ్యక్ష స్థానం కోసం వన్నెరప్ప, కెహెచ్.గోపాల్ నామినేషన్ దాఖలు చేయగా ప్రధాన కార్యదర్శి స్థానం కోసం పివి.రామచంద్రప్ప, కృష్ణమూర్తి, మురళి పోటీ పడ్డారు. సీనియర్ న్యాయవాదులు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులతో చర్చించి ఏకగ్రీవంగా ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో వన్నెరప్ప అధ్యక్షులుగా, పివి రామచంద్రప్ప ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులను ఏపీపీ ఇందాద్, సీనియర్ న్యాయవాదులు నాగరాజు, ఎ.నాగరాజు రెడ్డి, రామిరెడ్డి, శివశంకర్ తదితరులు పూలమాలలు వేసి అభినందించారు.