వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న బ్యాంకు అధికారులు
గుడిబండ : మండలంలోని కెఎన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కెనరాబ్యాంకు సామాజిక బాధ్యతలో భాగంగా గుడిబండ కెనరా బ్యాంక్ శాఖ తరపున వాటర్‌ప్లాంట్‌ను అందజేశారు. రూ.90వేల విలువ చేసే వాటర్‌ప్లాంట్‌ను, గ్రంథాలయానికి అవసరమయ్యే దాదాపు 20వేల రూపాయలు విలువ చేసే టేబుళ్లను గుడిబండ కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ మల్లయ్య చేతుల మీదుగా బుధవారం అందజేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ సాయి సిద్ధార్థ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి,ఆ పాఠశాల విద్యా కమిటీ ఛైర్‌పర్సన్ రాధమ్మ , ఉపాధ్యాయులు బ్యాంకు సిబ్బంది ్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.