పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం

Mar 10,2025 21:34

నారా లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పల్లె రఘునాథరెడ్డి

                   పుట్టపర్తి రూరల్‌: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర మానవ వనరుల అభివద్ధి ఐటి కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి లోకేష్‌ కు పుట్టపర్తి విమానాశ్రయంలో తెలుగుదేశం నాయకులు, అధికారులు సోమవారం ఘనంగా స్వాగతం పలికారు. గన్నవరం నుండి 5 .15 నిమిషాలకు ఆయన పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. విమానం నుండి బయటకు రాగానే ఆయనకు పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయ విశ్రాంతి భవనంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఆయనకు చిత్రపటాలు బొకేలు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్‌, హిందూపురం ఎంపీ పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌చ పరిటాల శ్రీరామ్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సుబ్రహ్మణ్యం. లాయర్‌ రాజశేఖర్‌ , లోకేష్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం విమానాశ్రయంలోని హాలులో నారా లోకేష్‌ ను కలవడానికి వచ్చిన నాయకులను కార్యకర్తలను ఆయన పలకరించారు. అనంతరం ప్రత్యేక కాన్వారు లో కదిరి బయలుదేరి వెళ్లారు. లోకేష్‌ పర్యటన సందర్భంగా విమానాశ్రయం, పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పుట్టపర్తి క్రైమ్‌ : కదిరి లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కు పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి లోకేష్‌ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయానికి భారీ ఎత్తున పల్లె అభిమానులు, లోకేష్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ లోకేష్‌ కు సత్యసాయి బాబా చిత్రపటాన్ని అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ముస్లిం, మైనారిటీ విభాగపు కార్యదర్శి మహమ్మద్‌ రఫీ లోకేష్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగోచం అందజేసి స్వాగతం పలికారు.

➡️