రైతులకు డ్రిప్ పరికరాలు అందజేస్తున్న ఎమ్మెల్యే, తదితరులు
మడకశిర : రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని యాదవ కళ్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి టిడిపి, నాయకులు, కార్యకర్తలు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టిడిపి జిల్లా అధ్యక్షులు అంజనప్ప , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హుడైతే తనమీద పోటీ చేసిన వైసిపి అభ్యర్థి కూడా ప్రభుత్వగృహం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో 15వేల ఇళ్లను మంజూరు చేసి ఇల్లు లేదని వినతిపత్రాలు రాకుండా చూడటమే ధ్యేయంగా అధికారులు, నాయకులు పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిరకు వచ్చినప్పుడు 10వేల ఇళ్లు కావాలని అభ్యర్థించగా సానుకూలంగా స్పందించిన ఆయన అర్హులైన వారికి గృహాలను మంజూరు చేస్తామని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో ఆగలి జడ్పిటిసి ఉమేష్, కన్వీనర్లు లక్ష్మీనారాయణ , దాసిరెడ్డి, గణేష్, మద్దనకుంటప్ప, కుమారస్వామి, మాజీ ఎంపీపీలు కృష్ణమూర్తి, మీనాక్షి రామిరెడ్డి, సీనియర్ టిడిపి నాయకులు ప్రసాద్, మాజీ జడ్‌పిటిసిలు సన్నతిమప్ప, నరసింహమూర్తి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యం : రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. 90శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తున్న డ్రిప్పు పరికరాలను మంగళవారం పట్టణం లోని యాదవ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కష్టాలను ఇబ్బందులను గ్రహించి అర్హత ఉన్న ప్రతి రైతుకు సబ్సిడీతో డ్రిప్పు పరికరాలు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, టిడిపి మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ, దాసిరెడ్డి, గణేష్ కుమారస్వామి, మదన కొండప్ప, కుంచితి ఒక్కలిగ రాష్ట్ర కన్వీనర్ విఎం. పాండురంగప్ప, ఎపిఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్, మాజీ జడ్పిటిసిలు నరసింహమూర్తి, సన్న తిమ్మప్ప, మాజీ కన్వీనర్లు శివ రుద్రప్ప, క్లస్టర్ ఇన్‌ఛార్జులు శివకుమార్, నాగరాజుతో పాటు టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.