అంతా కొత్త వారే

వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో

* * 

  • తొలిసారి ఎమ్యెల్యే అభ్యర్థులుగా ఏడుగురికి అవకాశం
  • పెండింగ్‌లో టెక్కలి ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎంపీ స్థానంకాంగ్రెస్‌ మొదటి జాబితా విడుదల

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, యంత్రాంగం

వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున అసెంబ్లీకి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా మంగళవారం విడుదలైంది. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు గాను ఏడు చోట్ల అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేసింది. టెక్కలి ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎంపీ స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. రెండు మూడు రోజుల్లో ఈ రెండింటికీ పేర్లను ప్రకటించొచ్చని డిసిసి వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ వెలువరించిన మొదటి జాబితాలో ఏడుగురూ కొత్తవారే కావడం గమనార్హం. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కల్పించడంపై వారంతా ఆనంద పరవశులవుతున్నారు.శ్రీకాకుళం నుంచి నాగభూషణరావు పోటీశ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పైడి నాగభూషణరావు పేరును అధిష్టానం ప్రకటించింది. పొందూరు మండలం కింతలికి చెందిన ఆయన వ్యాపరవేత్తగా ఉన్నారు. డిగ్రీ వరకు చదివారు. 1994లో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ కార్యదర్శిగా ప చేశారు. 2002లో పొందూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షునిగా, 2016 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగమైన సేవాదళ్‌ జిల్లా అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా 2022 వరకు కొనసాగారు. ఇచ్ఛాపురానికి చక్రవర్తిరెడ్డి ఇచ్ఛాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మండలంలో కేసుపురం గ్రామ ఎంపిటీసి మాసుపత్రి చక్రవర్తిరెడ్డి పేరు అధిష్టానం ఖరారు చేసింది. ఇటీవలే ఆయన వైసిపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ జీవితం ప్రారంభించి తర్వాత వైసిపిలో చేరారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరి టిక్కెట్‌ పొందారు. పలాస అభ్యర్థిగా మజ్జి త్రినాథబాబుపలాస నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మందస గ్రామానికి చెందిన మజ్జి త్రినాథబాబును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈయన మాజీ మంత్రి, ఉమ్మడి పిసిసి అధ్యక్షునిగా పని చేసిన మజ్జి తులసీదాస్‌ తనయుడు. తులసీదాస్‌ మరణాంతరం ఆయన వారసురాలిగా మజ్జి శారద కాంగ్రెస్‌ పార్టీలో డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇప్పుడు తులసీదాస్‌ చిన్న కుమారుడు మజ్జి త్రినాథబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌టిసిలో అధికారిగా పనిచేశారు. ఉద్యోగంలో విఆర్‌ఎస్‌ తీసుకుని 2021లో కాంగ్రెస్‌లో చేరారు. పాతపట్నం బరిలో వెంకటరావుపాతపట్నం నియోజకవర్గానికి కొప్పురౌతు వెంకటరావు పేరును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈయన మండలంలోని గురండికి చెందిన ఆయన ఇంటర్‌ వరకు చదివారు. భార్య సుమలత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపి తరుపున పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గతంలో ఈయన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ముద్రా బ్యాంకు జిల్లా కన్వీనర్‌గా పనిచేశారు.నరసన్నపేట నుంచి నరసింహమూర్తినరసన్నపేట నియోజకవర్గం నుంచి మంత్రి నరసింహమూర్తి పోటీ చేయనున్నారు. ఈయన తల్లిదండ్రులు అప్పలనరసమ్మ, అప్పలనరసయ్య స్వాతంత్య్ర సమర యోధులు. ఈయన1965లో కోటబొమ్మాళి మండలం తిలారులో జన్మించారు, నరసన్నపేటలో నివాసం ఉంటున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. వాల్తేరు డివిజన్‌ రైల్వే వినియోగదారులు కమిటీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, యువజన కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి, కోటబొమ్మాళి మండలం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షునిగా పలు పదవులు నిర్వహించారు.ఆమదాలవలసలో అన్నాజీరావుకి అవకాశంఆమదాలవలస అభ్యర్థిగా సనపల అన్నాజీరావుకు కాంగ్రెస్‌ అధిష్టానం అవకాశం కల్పించింది. తొలుత మండలంలోని కట్యాచార్యులపేట పిఎసిఎస్‌ అధ్యక్షులుగా పని చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను చూస్తున్నారు. ఈయన భార్య సుజాత, కుమారుడు రాకేష్‌, కుమార్తె అలేఖ్యతో పాటు అల్లుడు అనిల్‌ కుమార్‌ ఉన్నారు. ఎచ్చెర్ల నుంచి మల్లేశ్వరరావుఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున కరిమజ్జి మల్లేశ్వరరావు పోటీ చేయనున్నారు. నగరపుపాళెంలో 1962లో జన్మించారు. భార్య అనసూయమ్మతో ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపి, ప్రజారాజ్యం, టిడిపి, వైసిపి, జనసేన పార్టీల్లో పనిచేశారు. పిసిసి అధ్యక్షులుగా వై.ఎస్‌.షర్మిల బాధ్యతలు చేపట్టి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టెక్కలి పెండింగ్‌ వెనుక…జిల్లాలో ఏడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి టెక్కలి స్థానాన్ని పెండింగ్‌లో ఉంచడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన కోత మధుసూదనరావు పేరు దాదాపుగా ఖరారవువుతందని అంతా భావించారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీలో చేరే అవకాశం ఉండటంతో ఈ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు చర్చ నడుస్తోంది. టెక్కలి ఎమ్మెల్యే స్థానానికి కృపారాణి పోటీ చేస్తారా? లేక అతని పెద్ద కుమారుడు కిల్లి విక్రాంత్‌ను రంగంలోకి దించుతారా? అనేది చూడాల్సి ఉంది. అయితే కిల్లి కృపారాణి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఈ అంశం ఒక కొలిక్కి రావొచ్చని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి.

➡️