అసౌకర్యాలనే మాట రాకూడదు

ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

  • సమన్వయంతో రథసప్తమి ఉత్సవాల నిర్వహణ
  • కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ఈనెల 16న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, నిరంతరం విద్యుత్‌ అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ముందస్తుగా జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టాలని, నిరంతరం తాగునీటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. వికలాంగులు, వృద్ధుల కోసం వీల్‌చైర్స్‌ ఏర్పాటు చేసి, అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం సిసి కెమెరాలు పనిచేసేలా చూడాలని, కమాండ్‌ కంట్రో ల్‌ రూమ్‌లో రెవెన్యూ, దేవాదాయశాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో వాహనాల పార్కింగ్‌కి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. పుష్కరిణి పరిసరాల్లో లైటింగ్‌ ఏర్పాట్లు చేయాలన్నా రు. సమావేశంలో ఎస్‌పి జి.ఆర్‌ రాధిక, శ్రీకాకుళం కార్పొ రషన్‌ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా, ఎఎస్‌పి ప్రేమ్‌ కాజల్‌, డిఆర్‌ఒ గణపతిరావు, ఆర్‌డిఒ సిహెచ్‌. రంగయ్య, దేవాదాయశాఖ ఆర్‌జెసి విజరుకుమార్‌, సహాయ కమిషనర్‌ డి.వి.వి.ప్రసాద్‌ పట్నాయక్‌, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, అర సవల్లి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

➡️