ఇద్దరికి ఉద్యోగోన్నతి

జిల్లా పరిషత్‌ యాజమాన్యం పరిధిలో ఇద్దరు రికార్డు అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ చైర్‌పర్సన్‌ పిరియా విజయ

ఉద్యోగోన్నతి పత్రాన్ని అందజేస్తున్న విజయ

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లా పరిషత్‌ యాజమాన్యం పరిధిలో ఇద్దరు రికార్డు అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ చైర్‌పర్సన్‌ పిరియా విజయ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గార మండలం శ్రీకూర్మం హైస్కూల్‌ రికార్డు అసిస్టెంట్‌గా ఉన్న వై.గణపతిరావును సీనియర్‌ సహాయకులుగా జిల్లా పరిషత్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎచ్చెర్ల మండలం మెట్టవలస హైస్కూల్‌ రికార్డు అసిస్టెంటుగా ఉన్న కె.మురళీకృష్ణ పట్నాయక్‌ను పొందూరు మండలం తోలాపి హైస్కూల్‌ సీనియర్‌ సహాయకులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. ఈ మేరకు వారికి జెడ్‌పి సిఇఒ డి.వెంకటేశ్వరరావు, ఉపముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్‌.వెంకట్రామన్‌, సి-సెక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️