ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే అజెండా

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ఎపిటిఎఫ్‌ ప్రధాన అజెండా

 

ప్రజాశక్తి- కవిటి

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ఎపిటిఎఫ్‌ ప్రధాన అజెండా అని మండల ఎపిటిఎఫ్‌ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రంగారావు అన్నారు. మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల కవిటి ప్రాంగణంలో ఎపిటిఎఫ్‌ 1938 నూతన కార్యవర్గం ఎంపిక సోమవారం నిర్వహించారు. అందులో భాగంగా మండల శాఖ అధ్యక్షులుగా బల్ల ధర్మారావు, ప్రధాన కార్యదర్శిగా గుడియా వంశి, ఉపాధ్యక్షులుగా అనపోజు హిమకుమార్‌, అదనపు కార్యదర్శులుగా భార్గవ్‌, శ్రీకాంత్‌, ట్రెజరర్‌గా మొర్రి రవి, కార్యదర్శులుగా లింగరాజు బెహరా, కొల్ల ప్రకాష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశంలో ఎపిటిఎఫ్‌ సీనియర్‌ కార్యకర్తలు బల్లెడ లక్ష్మణమూర్తి, మొర్రి గోపి, పీస విజయకుమార్‌, ఎస్‌.రాజబాబు, శ్రీరామ్మూర్తి, బల్లెడ ఉషారాణి, శ్రీధర్‌ సమంతో, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

 

➡️