క్రీడాకారులకు అభినందనలు

విద్యార్థి దశనుంచే యువత క్రీడల్లో రాణించాలని మండల ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ అన్నారు. ఇటీవల ఆడుదాం

ట్రోఫీని అందజేస్తున్న బాలకృష్ణ, సీతంనాయుడు

లావేరు:

విద్యార్థి దశనుంచే యువత క్రీడల్లో రాణించాలని మండల ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ అన్నారు. ఇటీవల ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా క్రీడల్లో గెలుపొందిన విజేతలకు సోమవారం ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లో దృష్టి సారించాలన్నారు. జిల్లాకు చెందిన కరణం మల్లేశ్వరి, పూజారి శైలజ తదితరులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా పలు ఆటల్లో పాల్గొన్న 74 మందికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గొర్లె భాస్కరరావు, జెడ్‌పిటిసి ఎం.సీతంనాయుడు, ఇఒపిఆర్‌డి ప్రభాకరరావు, జెసిఎస్‌ ఇన్‌ఛార్జి మీసాల శ్రీనువాసరావు, ఎంపిడిఒ కార్యాలయ సీనియర్‌ సహాయకులు మాధవరావు పాల్గొన్నారు.

 

➡️