చంద్రబాబు వల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం

మాజీ సిఎం చంద్రబాబు నాయుడు

మాట్లాడుతున్న మంత్రి ప్రసాదరావు

  • రెవెన్యూ మంత్రి ప్రసాదరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

మాజీ సిఎం చంద్రబాబు నాయుడు వల్లే సామాజిక పింఛన్ల పంపిణీలో జాప్యం ఏర్పడిందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించా రు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ జోక్యంతో పింఛన్ల పంపిణీ వాలంటీర్లు చేయకూడదని నిబంధన విధించారని పేర్కొన్నా రు. నగరంలోని ఓ హోటల్లో మంగళవారం నగర వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడు తూ చంద్రబాబుకు అధికారం వస్తే ఈ ప్రభుత్వ పథకాలను ఆపేస్తారని చెప్పారని అన్నారు. తన స్వార్థం కోసం ప్రజా ప్రయో జనాలను పట్టించుకోరన్నారు. గతంలో చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు దోచుకోవడం తప్ప మరే ఆలోచన చేయలేద న్నారు. గడిచిన ఐదేళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. ఒకటి ఉదయమే నిబద్ధతతో కూడిన వాలంటీర్లు ఇంటింటికీ చేరుకుని లబ్ధిదారు లకు పింఛన్లు అందించేవారని అన్నారు. చంద్రబాబు ్పఇంఛన్ల పంపిణీలో వాలంటీర్లను భాగం చేయొద్దని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నెల కానీ, ఈ నెల 1న పింఛన్లు అందలేదని అన్నారు. దీంతో లబ్ధిదారులు పింఛన్ల కోసం నిరీక్షించాల్సి వస్తోందన్నారు. సమావేశంలో కుప్పిలి సూర్యారా వు, శ్రీనివాస్‌, రాజు, అరుణ, విజయబాబు, కె.అప్పారావు, నర్సింహులు, చిట్టివలస గణేష్‌, రౌతు శంకరరావు పాల్గొన్నారు.

➡️