చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

కోటబొమ్మాళి : మాట్లాడుతున్న ఎంపిడిఒ పద్మజ

ప్రజాశక్తి- పలాస

రానున్న వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలో గల పలు వ్యాపార సంస్థల యజమానులు, స్వచ్ఛంద సంస్థలతో చలివేంద్రాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున నగరంలో రోజుకు వేలాది మది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని వారిని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పిఒ అప్పలరాజు. సత్యసాయి సేవా సమితి ప్రతినిధి టి.రాజేశ్వరరావు, పి.నారాయణ, లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ క్యాజులాండ్‌ మల్ల జయశ్రీ, సంతోషి, టి.శ్వేత, లక్కీ షాపింగ్‌మాల్‌ మేనేజర్‌ దారినాయుడు, పెట్రోల్‌ బంక్‌ యజమానులు కె.వి.రామకృష్ణ, మల్లా సంతోష్‌ పాల్గొన్నారు.కోటబొమ్మాళి: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంపిడిఒ ఎచ్చెర్ల పద్మజ అన్నారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయ సమావేశ మందిరంలో కార్యదర్శులు, అంగన్వాడీ, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి అధిగమించే విధంగా కృషి చేయాలన్నారు. ఏ గ్రామంలోనైనా మంచినీటి పథకాలు పనిచేయకపోయినా, బోర్లు మరమ్మతులకు గురైతే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ పనులు ఎండను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి 6 గంటల వరకు పనులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో కొత్తపల్లి, నిమ్మడ పిహెచ్‌సి వైద్యులు డాక్టర్‌ గురుగుబెల్లి సురేష్‌ కుమార్‌, డాక్టర్‌ వరుణ్‌, ఎంఇఒలు ఎస్‌.అప్పలరాజు, ఎల్‌వి.ప్రతాప్‌, ఎపిఒ జి.హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

 

➡️