చెట్లు నరికేశారు.. వదిలేశారు

కవిటిలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ 33కెవి లైన్‌కోసం

కవిటి కొత్తూరు వద్ద రోడ్డుపై చెట్ల కొమ్మలు

ప్రజాశక్తి- కవిటి

కవిటిలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ 33కెవి లైన్‌కోసం కొన్ని గ్రామాల వద్ద అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించారు. అయితే తొలగించిన కొమ్మలు వెంటనే తరలించకుండా రోడ్డుపైనే వదిలేశారు. ప్రస్తుతం అవి వాహనదారులకు పరీక్ష పెడుతున్నాయి. ముఖ్యంగా కవిటి కొత్తూరు, బొర్రపుట్టుగ, చండిపుట్టుగ గ్రామాల వద్ద తొలగించిన కొమ్మలు రోజులు గడుస్తున్నా తీయకపోవడంతో సాయంత్రం, రాత్రి వేళల్లో ఇటీవల కాలంలో పలు ప్రమాదాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనం కూడా వెళ్లేందుకు అవకాశం లేదని, చెట్ల కొమ్మలు పూర్తిగా రోడ్డుపైనే వదిలేయడంతోనే ఈ సమస్య వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి రోడ్డుపై వేసిన చెట్ల కొమ్మలు వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

 

➡️