జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో…జిల్లా విద్యార్థుల ప్రతిభ

జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో

విజేతలుగా నిలిచిన కాకినాడ ఆదిత్య విద్యార్థులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మెరుగైన ర్యాంకులు సాధించి సత్తా చాటారు. సీతంపేట ఐటిడిఎ ఆధ్వర్యాన శ్రీకాకుళం నగరంలోని వైటిసిలో నిర్వహిస్తున్న ఐఐటి సూపర్‌-60 విద్యార్థులు 30 మంది మెయిన్స్‌ పరీక్షలకు హాజరు కాగా 20 మంది జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. వీరిలో ఆరుగురికి ఆలిండియా స్థాయిలో ప్రముఖ కళాశాలల్లో ఎన్‌ఐటి ప్రవేశానికి అవకాశం ఉందని కళాశాల కోర్స్‌ డైరెక్టర్‌ మురళీబాబు తెలిపారు. కొత్తూరు ఉపేంద్ర 88.98 శాతం, గేదెల చైతన్య 87.14 శాతం, ఆరిక ప్రశాంత్‌ 83.96శాతం, సవర స్రవంతి 78.07 శాతం, బిడ్డిక ఫ్రాన్సిస్‌ 75.79 శాతం, సవర అభి 71.50 శాతం మార్కులు సాధించారని చెప్పారు. ఈ ఏడాది ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కోర్సు ఆలస్యంగా ప్రారంభించామని, ఐదు నెలల్లోనే 20 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడం గొప్ప విషయమని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి తెలిపారు. అర్హత సాధించిన విద్యార్థులు, బోధనా సిబ్బందిని ఆమె అభినందించారు. రాష్ట్రంలో ఐటిడిఎల్లో సీతంపేట ఐటిడిఎ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సూపర్‌-60 ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.చక్రధర్‌ కళాశాల విద్యార్థుల సత్తాజెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో శ్రీకాకుళం నగరంలోని చక్రధర్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. కళాశాల నుంచి 50 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 17 మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారని కళాశాల చైర్మన్‌ యాళ్ల చక్రధర్‌ తెలిపారు. అర్హత సాధించిన మొదలవలస నితీష్‌కుమార్‌, ఎస్‌.ప్రసన్నకుమార్‌, కె.రాకేష్‌, పి.గౌతమ్‌, పి.మణికంఠ, బి.సాయిదత్‌, కె.నిఖిల ప్రశాంతి, కె.లేఖన ప్రియ, ఎల్‌.తోషన్‌, జి.సత్యమణికంఠ, పి.మన్మోహన్‌, జి.శైలేష్‌, టి.వరుణ్‌ కళ్యాణ్‌ను ఆయన అభినందించారు.’కాకినాడ ఆదిత్య’ విద్యార్థుల ప్రతిభశ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య జూనియర్‌ కళాశాల విద్యార్థులు జెఇఇ మెయిన్స్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. బి.స్వర్ణశ్రీ 99.35 శాతం మార్కులు సాధించగా, ఎం.ప్రవళ్లిక 99.26 శాతం మార్కులు సాధించింది. వీరితో పాటు 15 మంది విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించారు. వీరంతా అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించారని ప్రిన్సిపాల్‌ ఎం.ఢిల్లేశ్వరరావు తెలిపారు. విద్యార్థులను కళాశాల కార్యదర్శి ఎన్‌.కె దీపక్‌ రెడ్డి, డైరెక్టర్‌ బి.ఎస్‌ చక్రవర్తి అభినందించారు.శభాష్‌ సాయికుమార్‌సంతబొమ్మాళి : మండలంలోని అంట్లవరానికి చెందిన కప్పల సాయికుమార్‌ 99.57 శాతం మార్కులతో సత్తా చాటాడు. ఒకటి నుంచి పదో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో, ఇంటర్మీడియట్‌ రాజమండ్రిలోని తిరుమల విద్యాసంస్థల్లో చదవుతున్నాడు. తల్లిదండ్రులు మల్లేష్‌, లక్ష్మి హైదరాబాద్‌లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. సాయికుమార్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.మెరిసిన సాయిస్ఫూర్తికవిటి : మండలంలోని బల్లిపుట్టుగకు చెందిన మార్పు సాయిస్ఫూర్తి 97.085 శాతంతో సత్తా చాటింది. సాయి స్ఫూర్తి తండ్రి వెంకటేష్‌ వ్యవసాయం చేస్తుండగా తల్లి బిందుమాధవి ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తోంది. సాయి స్ఫూర్తి ఒకటి నుంచి 8వ తరగతి వరకు కవిటిలోని కళ్యాణి ఆంగ్ల పాఠశాలలో చదవగా, 9, 10 తరగతులు బొరివంక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో చదువుతోంది.సాధించిన సరయుకంచిలి : కంచిలికి చెందిన వూన సరయు 96.13 శాతం మార్కులు సాధించింది. సరయు పదో తరగతి కంచిలిలోని జెఎంజె ప్రైవేట్‌ పాఠశాలలో చదవగా, రాజమండ్రిలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. తండ్రి శ్రీకాంత్‌ కిరాణా వ్యాపారం కాగా, తల్లి అంబిక గృహిణి. సరయును తల్లిదండ్రులతో పాటు స్థానికులు అభినందించారు.అన్నదమ్ముల సత్తాటెక్కలి : టెక్కలికి చెందిన అన్నదమ్ములు డోకి విమలేష్‌, కమలేష్‌ జెఇఇ ఫలితాల్లో సత్తా చాటారు. కమలేష్‌ 99.1 శాతం మార్కులు సాధించగా, విమలేష్‌ 98.1 శాతం మార్కులు సంపాదించాడు. వీరు పదో తరగతి వరకు మండలంలోని సీతాపురం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్‌ ఒక కార్పొరేట్‌ కళాశాలలో చదివారు. తండ్రి డోకి సురేష్‌ హోల్‌సేల్‌ కిరాణా దుకాణం నడుపుతుండగా, తల్లి భవాని గృహిణి.

➡️